NewsWaves.news

భారత్ లో ఎన్నికలు ముగిసే వరకు ఇంతే : పాక్ ప్రధాని

భారత్ లో సార్వత్రిక ఎన్నికలు ముగిసేవరకు పాకిస్తాన్, ఇండియాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతునే ఉంటాయని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పుల్వామా ఉగ్ర దాడి అనంతరం భారత్, పాకిస్తాన్ ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన విషయం తెలిసిందే.

ఈ పరిస్థితులపై తాజాగా ఇమ్రాన్ ఖాన్ స్పందించారు. ప్రమాదం ఇంకా పొంచి ఉందని, భారత్ లో ఎన్నికలు ముగిసేవరకు ఇరుదేశాల మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగానే ఉంటాయని, భారత్ నుండి ఎదురయ్యే ఆక్రమణలకు సరైన సమాధానం ఇవ్వడానికి మేము సిద్ధంగానే ఉన్నామని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు. పాక్ ప్రధాని చేసిన వ్యాఖ్యలను ఆ దేశ ప్రముఖ దిన పత్రిక డాన్ ప్రచురించింది.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి