NewsWaves.news

నిన్న విడుదలైన సినిమాల పరిస్థితేంటి?

ఈ శుక్రవారం మూడు సినిమాలు థియేటర్లలో సందడి చేసాయి.’ఫలక్ నుమాదాస్’,NGK,అభినేత్రి 2.ఈ మూడు వేర్వేరు జోనర్ లకు సంబంధించిన చిత్రాలు. డబ్బింగ్ చిత్రమైనప్పటికి NGK చిత్రం పై భారీ అంచనాలున్నాయి. సూర్య కి తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉండడం,సెల్వరాఘవన్ కి మంచి దర్శకుడిగా పేరుండడం కారణాలు కావచ్చు.ఫలక్ నుమాదాస్ చిత్రానికి వస్తే ఇది మలయాళ కల్ట్ సినిమా అంగమలై డైరీస్ కి రిమేక్. విశ్వక్ సేన్ నటించి దర్సకత్వం వహించారు.చిత్ర ట్రైలర్ యువతని ఆకట్టుకోవడం తో ఒక వర్గాన్ని ఆకర్షించే సినిమా అవుతుందని భావించారు.ఇదే రోజు విడుదలైన మరో చిత్రం అభినేత్రి2.ఇదే కాంబినేషన్ లో వచ్చిన అభినేత్రి మోస్తారు విజయం సాధించింది. తమన్నా, ప్రభుదేవా నటించడం. విజయ్ దర్శకత్వం వహించడం హార్రర్ కామెడీ తరహా చిత్రం కావడంతో కొన్ని అంచనాలు ఉన్నాయి.

సూర్య నటించిన NGK చిత్రం తెలుగు ,తమిళం లో భారీ ఫ్లాప్ టాక్ మూటగట్టుకుంది.పొలిటికల్ బాక్ డ్రాప్ లో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల సహనాన్ని పరీక్ష పెట్టిందని చెప్పుకుంటున్నారు.దర్శకుడు కథ,కథనాలను గాలికి వదిలేసాడని చెబుతున్నారు. అటు సూర్య,ఇటు సెల్వ రాఘవన్ కెరీర్లో చెత్త చిత్రమంటున్నారు.విమర్శకులు సింగల్ రేటింగ్ ఇచ్చారు.
యువతని ఆకర్షించి విడుదలైన చిత్రం ఫలక్ నుమాదాస్ .ఈ చిత్రం లో ఫస్ట్ హాఫ్ పర్వాలేదు కానీ సెకండ్ హాఫ్ తేలిపోయిందని చెబుతున్నారు.సినిమా అంతా మందు ,ముక్కతోనే సరిపోయిందంటున్నారు. అంగమలై డైరీస్ లో ఉన్న సోల్ పట్టుకోవడం లో దర్శకుడు విఫలమయ్యాడని విమర్శకులు చెబుతున్న మాట. హైద్రాబాద్ మాస్ ప్రేక్షకులను కొంతమేర ఆకర్షిస్తోంది. కానీ మిగతా చోట్ల కష్టమే అంటున్నారు.మాత్ టాక్ ప్రకారం ఒక్కసారి చూడొచ్చు అంటున్నారు.యువతకి ఎంతవరకు ఆకర్షించింది అన్న విషయం రెండు రోజుల్లో తెలుస్తుంది.ఎక్కువగా నెగటివ్ రిపోర్ట్స్ వచ్చాయి.

మరో చిత్రం అభినేత్రి2 .ఈ చిత్రం గురుంచి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదంటున్నారు.కథ కథనాల విషయంలో పూర్తిగా గాడి తప్పింది.ప్రేక్షకులని ఏ కోశాన ఆసక్తి కలిగించలేకపోయింది.ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టేలా ఉంది.ఈ మూడు చిత్రాలు సినీ ప్రేక్షకులను పూర్తిగా నిరాశపరచాయని చెప్పవచ్చు. మళ్ళీ సినిమా కోసంమరో వారం ఎదురుచూడడం తప్ప ఎం చేయలేము.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి