NewsWaves.news

సర్వేలో తేలింది ఇదేనంటున్న లగడపాటి…

మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ నేడు తిరుపతిలో తన సర్వే ఫలితాలను వెల్లడించారు. ఏపీలో టీడీపీ, తెలంగాణలో టిఆర్ఎస్ హవా కొనసాగబోతుందని తెలిపారు. తెలుగుదేశం పార్టీ 90 నుంచి 110 స్థానాల్లో విజయం సాధిస్తుందని, ఇక వైసిపి 65 నుంచి 79 స్థానాలను సొంతం చేసుకుంటుందని,ఇతరులు 3 నుంచి 5 అసెంబ్లీ స్థానాలు దక్కించుకునే అవకాశం ఉందని తెలిపారు.ఇక పార్లమెంట్ స్ధానాలలో తెలుగుదేశం పార్టీ 13 నుంచి 17 స్థానాలను,వైసీపీ 8 నుంచి 12 స్థానాలను,ఇతరులు ఒక స్ధానంలో గెలిచే అవకాశం ఉందని తెలిపారు.

లగడపాటి సర్వే ప్రకారం అసెంబ్లీలో వివిధ పార్టీల ఓటింగ్ శాతం గమనించినట్లయితే… తెలుగుదేశం పార్టీ 43 నుంచి 45 శాతం, వైసీపీ 40 నుంచి 42 శాతం,ఇక జనసేన 10 నుంచి 12 శాతంగా ఉంటుందని తెలిపారు. అదే పార్లమెంటు స్థానాల విషయంలో… తెలుగుదేశం పార్టీ 43 నుంచి 45, వైసీపీ 40.5 నుంచి 42.5, జనసేన 10 నుంచి 12 శాతం ఓటింగ్ శాతం ఉంటుందని వెల్లడించారు.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి