NewsWaves.news

బాడీగార్డ్ ని పెళ్లి చేసుకున్న థాయిలాండ్ రాజు

థాయిలాండ్ రాజు ,తన వ్యక్తిగత భద్రత సిబ్బంది లో పనిజేస్తున్న అధికారిణి ని వివాహం చేసుకున్నారు.థాయిలాండ్ రాజు మహా వాజిరలోoకోర్న్ , తన వ్యక్తిగత భద్రతా దళం డిప్యూటీ చీఫ్ సుథిద ని వివాహం చేసుకున్నారు.


వాజిరలోoకోర్న్ మరో నాలుగు రోజుల్లో రాజు గా పట్టాభిషేకానికి సిద్ధమవుతున్నారు. ఈ వివాహంతో ఆమెకు రాణి అధికారిక గుర్తింపు ఇచ్చారు .కొన్ని 66 ఏళ్ల వాజిరలోoకోర్న్ తన తండ్రి మృతి తర్వాత అధికారకంగా రాజు అయ్యారు .తండ్రి మరణాంతరం సింహాసం అధిష్టించినప్పటికీ మరణాంతరం జరిగిన సంతాప దినాలు తర్వాత ఆయనకు పట్టాభిషేకం జరుగుతుంది .ఈ నెల 4న పట్టాభిషేక మహోత్సవం జరగనుంది .ఈలోపు వివాహం చేసుకొని అందరిని ఆశ్చర్యపరిచారు. థాయ్ ఎయిర్ వేస్ లో సాధారణ ఫ్లైట్ అటెండెంట్ గా పనిచేసిన ఆవిడని 2017 లో రాజు వ్యక్తిగత భద్రతా దళం లో డిప్యూటీ కమిషనర్ గా తీసుకున్నారు.

అయితే ఇంతకు ముందు వారిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుందని రాజప్రసాదం లోనూ ,దేశి మీడియాలోనే గుసగుసలు వినిపించాయి .ఈ విషయాన్ని రాచకుటుంబం ఖండిస్తూ వచ్చింది. మూడు పెళ్లిళ్లు జరిగాయి ఇది నాలుగో పెళ్లి ఆయనకు ఏడుగురు పిల్లలు కూడా ఉన్నారు.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి