NewsWaves.news

దాసరి పుట్టినరోజుని దర్శకుల దినోత్సవంగా జరుపుకోవడం గొప్ప విషయం: చిరంజీవి.

దాసరి నారాయణరావు పుట్టిన రోజున దర్శకుల దినోత్సవంగా జరుపుకోవడం నిజంగా గొప్ప విషయం. అంతకన్నా గొప్ప నివాళి ఉండదన్నారు ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి .

శనివారం దాసరి జయంతి సందర్భంగా తెలుగులో దర్శకుల సంఘం హైదరాబాదులో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది .ఈరోజు (మే 4) దర్శకుల దినోత్సవంగా జరుపుకున్నారు .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి విచ్చేశారు .ఈ సందర్భంగా చిరంజీవి దాసరి గారితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తెలుగు సినిమా పరిశ్రమలో అని స్థానం ఎవరు పూడ్చలేరని తెలిపారు. దర్శకుడిగా ఆయన శైలి ప్రత్యేకమైనదిగా చెప్పారు .అలాంటి దర్శకుడు మళ్లీ రాడని తెలిపారు .

దర్శకుల సంఘం తరఫున 5 కోట్ల నిధి ఏర్పాటుచేయాలన్నది ఆలోచనగా రాఘవేంద్రరావు తెలిపారు. అందుకోసం ప్రముఖ దర్శకులు తమ వంతుగా విరాళాలు ప్రకటించారు.ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి దర్శకుల సంఘం నిధికి 25 లక్షలు విరాళం ప్రకటించారు.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి