NewsWaves.news

భార‌త సైన్యం చిత‌క్కొట్టినందు వ‌ల్లే వాడు ఉగ్ర‌వాదిగా మారాడు.. ఉగ్ర‌వాది తండ్రి

ఇండియన్ ఆర్మీ అన‌వ‌స‌రంగా కొట్ట‌డం వ‌ల్లే త‌న కొడుకు ఉగ్ర‌వాదిగా మారడంటున్నాడు పుల్వామా దాడికి పాల్ప‌డిన ఉగ్ర‌వాది ఆదిల్ అహ్మ‌ద్ దార్ తండ్రి. పుల్వామాలో సీఆర్పీఎఫ్ సైనికులు ప్ర‌యాణిస్తున్న బ‌స్సును కారుతో ఢీకొని ఆత్మ‌హుతి చేసుసుకుని… 43 మంది వీరుల మృతికి కార‌ణం అయిన ఉగ్ర‌వాది ఆదిల్ త‌ల్లిదండ్రులు రాయిట‌ర్స్ అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పారు.

పుల్వామా ఉగ్ర‌దాడిలో అమ‌రులైన కుటుంబ స‌భ్యులు ఎంత బాధ ప‌డుతున్నారో తాము కూడా అంతే బాధ ప‌డుతున్నామ‌న్నాడు ఆదిల్ తండ్రి గులామ్ అహ్మ‌ద్ దార్‌. అయితే ఆదిల్ అహ్మ‌ద్ ఇలా మార‌డానికి భార‌త సైన్య‌మే కార‌ణం అని నిందిస్తున్నాడు. 2016లో మిత్రుల‌తో క‌లిసి స్కూల్ నుంచి తిరిగి వ‌స్తున్న ఆదిల్‌ను భార‌త సైనికులు ఆపి చిత‌క్కొట్టారని.. అప్ప‌టి నుంచి కోపం పెంచుకున్న ఆదిల్ త‌ర్వాత ఉగ్ర‌వాదం వైపు వెళ్లాడ‌ని తెలిపాడు గులామ్ అహ్మ‌ద్‌. అయితే ఇంత దారుణం చేస్తాడ‌ని ఊహించ‌లేదని…2018 మార్చిలో మాయ‌మైన ఆదిల్ త‌ర్వాత క‌నిపించ‌లేదన్నారు ఆదిల్ త‌ల్లి ఫ‌హ‌మీదా.

Related Articles