NewsWaves.news

పుల్వామాలో తీవ్రవాదుల కాల్పులు.. నలుగురు జవాన్ల మృతి

జమ్ముకశ్మీర్‌ మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లుతోంది. పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. జిల్లాలోని పింగ్లాన్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు దాక్కున్నారన్న సమాచారంతో ఆర్మీ, పోలీస్‌, సీఆర్పీఎఫ్‌ బలగాలు సోదాలు చేపట్టాయి. దీంతో తీవ్రవాదులు భద్రతా బలగాలపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆర్మీ మేజర్‌ సహా నలుగురు జవాన్లు మృతి చెందారు. తీవ్రవాదులు ఉన్న ఇంటిని సైన్యం చుట్టుముట్టింది. ఉగ్రవాదులకు, సైన్యానికి మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. నాలుగు రోజుల క్రితం జరిగిన ఆత్మాహుతిదాడిలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాది 44 మంది భారత సైన్యాన్ని పొట్టనపెట్టుకున్న విషయం తెలిసిందే.

Related Articles