NewsWaves.news

వేగంగా మాట్లాడేది తెలుగు భాషేన‌ట‌

దేశ‌భాష‌లందు తెలుగులెస్స అని ఆంధ్ర‌భోజుడు శ్రీ‌కృష్ణ‌దేవ‌రాయ‌లు ఆనాడే చెప్పారు. అమ్మ ప్రేమ‌లా క‌మ్మ‌నైన‌ది , తేనెక‌న్నా మ‌ధుర‌మైన‌ది తెలుగు భాష‌ . తెలుగు మాట్లాడుతున్నా, ఆల‌కించినా, రాసినా క‌లిగే ఆ అనుభూతి మ‌ధురాతిమ‌ధురం. తాజాగా తెలుగుభాష గొప్ప‌త‌నం మ‌రోసారి విశ్వవ్యాప్త‌మైంది. యావ‌త్ ప్ర‌పంచంలో దాదాపు ఏడువేల భాష‌లు మాట్లాడేవారున్నారు. వంద‌కోట్ల‌మందికిపైగా అత్య‌ధికంగా మాండ‌రిన్ భాష మాట్లాడేవారున్నారు….

కేవ‌లం ఒక్క‌రికి మాత్ర‌మే తెలిసిన భాష‌లు 46 ఉన్నాయి. ఇన్నివేల భాష‌ల‌లో ఏ భాష‌ను వేగంగా మాట్లాడ‌తారో, అత్యంత స‌మ‌ర్థ‌మైన భాష ఏదో తెలుసుకోవాల‌నే జిజ్ఞాస‌తో కొంద‌రు ప‌రిశోధ‌కులు లోతుగా అధ్య‌య‌నం చేశారు. ఆస్ట్రియాలోని క్లాగెన్‌ఫర్ట్ యూనివర్సిటీ లింగ్విస్టిక్ ప్రొఫెసర్ గెర్ట్రాడ్ ఫెంక్-ఒక్జలాన్ ఈ దిశ‌గా ప‌రిశోధించారు. స‌మ‌గ్రంగా అధ్య‌య‌నం చేశారు. ద‌క్షిణ భార‌తావ‌నిలో 8కోట్ల‌మందికి పైగా మాట్లాడే తెలుగుభాష ఎంతో వేగంగా మాట్లాడే భాష‌గా గుర్తించిన‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు.

Related Articles