NewsWaves.news

కిడ్నీ బాధితులకు ఉచిత బస్సు ప్రయాణం

కిడ్నీ బాధితులు తెలంగాణా ఆర్టీసీ బస్సుల్లో ఇకపై ఉచితంగా ప్రయాణం చేయవచ్చని సంస్థ ఇన్‌ఛార్జి ఎండీ సునీల్‌శర్మ ప్రకటించారు. మరుగుజ్జులకు 50శాతం రాయితీ కల్పించినట్లే, కిడ్నీ బాధితుల ఉచిత ప్రయాణానికి బస్సు పాసులు ఇస్తామని పేర్కొన్నారు.

ఆరోగ్యశ్రీ పథకం కింద ఆరోగ్య పరీక్షలు, చికిత్స చేయించుకునే 7,600 మందికి దీని ద్వారా లబ్ధి చేకూరుతుందన్నారు. పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌లతో పాటు హైదరాబాద్‌, వరంగల్‌ నగరాల్లో సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌, డీలక్స్‌ బస్సుల్లోనూ ప్రయాణానికి అనుమతిస్తామన్నారు.

Related Articles