NewsWaves.news

అవయవదానంపై “తెలంగాణ జాగృతి”…

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పుట్టిన రోజు సందర్భంగా తెలంగాణ జాగృతి సంస్థ టీ న్యూస్ సంయుక్తంగా మహోన్నత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.అవయవ దానం పట్ల ప్రజలలో చైతన్యం కలిగించి, ప్రజలను అవయవదానం దిశగా ప్రోత్సహించే విధంగా కార్యాచరణను రూపొందించింది తెలంగాణ జాగృతి సంస్థ.

జాగృతి అధ్యక్షురాలు నిజామాబాద్ ఎంపీ కవిత ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని అధికారికంగా కెసిఆర్ పుట్టినరోజు అయిన ఫిబ్రవరి 17వ తేదీన ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రాలలో ప్రజలలో అవయవ దానం పట్ల అవగాహన కల్పించి అవయవ దానం దిశగా సామూహిక ప్రతిజ్ఞ చేయించనున్నారు.కెసిఆర్ పుట్టిన రోజైన ఫిబ్రవరి 17 మొదలుకొని సంవత్సరం పాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది.

Related Articles