NewsWaves.news

తెలంగాణాలో మరో 2 జిల్లాలు

నూతనంగా ఆవిర్భవించి అభివృద్ధి పధంలో ముందుకెళ్తున్న తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు జిల్లాలు కలవగా నేటినుంచి మనుగడలోకి వచ్చాయి. నారాయణపేట, ములుగురు కలెక్టరేట్లను ఆదివారం ఉదయం  ఆ జిల్లాల ఇన్‌ఛార్జి కలెక్టర్లు ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు పలువురు పాల్గొన్నారు. నారాయణపేట నూతన జిల్లా కలెక్టర్‌ కార్యాలయాన్ని జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్‌ రోనాల్డ్‌రోస్‌, స్థానిక ఎమ్మెల్యే ఎస్‌ రాజేందర్‌రెడ్డి, మక్కల్‌, కొడంగల్‌ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు జిల్లా ఎస్పీ కార్యాలయాలన్ని ఇన్‌ఛార్జి ఎస్పీ రెమా రాజేశ్వరి ప్రారంభించారు. ములుగు కలెక్టరేట్‌ను జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్‌ వి.వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఇన్‌ఛార్జి ఎస్పీ భాస్కరన్‌ ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Related Articles