NewsWaves.news

కేసీఆర్ టీమ్‌లో కొత్త మంత్ర‌లు వీరే..

తెలంగాణ ప్ర‌భుత్వంలో కొత్త మంత్రులు ప్ర‌మాణ స్వీకారం చేశారు. కొద్ది స‌మ‌యం క్రిత‌మే ఈ ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మం ముగిసింది. రెండు నెల‌ల నుంచి ఎప్పుడెప్పుడా అని ప్ర‌జ‌లు వేచి చూస్తున్న క్యాబినెట్ విస్త‌ర‌ణ‌కు కొన్ని రోజుల ముందే ప్ర‌క‌టన చేసిన ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. త‌న టీమ్‌ను ప్ర‌మాణ స్వీకారానికి తీసుకొచ్చారు. వీరితో తెలంగాణ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ ఈఎస్ ఎల్ న‌ర‌సింహ‌న్ ప్ర‌మాణ స్వీకారం చేయించారు.

కొత్త మంత్ర‌లు వీరే..

*అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి మొద‌ట‌గా ప్ర‌మాణ స్వీకారం చేశారు.

*తర్వాత త‌లసాని శ్రీనివాస్ ప్ర‌మాణ స్వీకారం చేశారు.

*త‌ల‌సాని త‌రువాత సూర్య‌పేట ఎమ్మెల్యే, మాజీ విద్యుత్ శాఖా మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి ప్ర‌మాణ స్వీకారం చేశారు. ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు కూడా వ‌రుస‌గా దైవ సాక్షిగా ప్ర‌మాణ స్వీకారం చేశారు..

*జ‌గ‌దీష్ రెడ్డి త‌రువాత ఈట‌ల రాజేంద‌ర్‌, సింగిరెడ్డి నిరంజ‌న్ రెడ్డి, కొప్పుల ఈశ్వ‌ర్ రెడ్డి, వేముల ప్ర‌శాంత్ రెడ్డి, మ‌ల్లారెడ్డి ప్ర‌మాణ స్వీకారం చేశారు.

Related Articles