NewsWaves.news

తెలంగాణ బ‌డ్జెట్‌-2019 -ముఖ్యాంశాలు

తెలంగాణ ప్ర‌భుత్వం ఈరోజు శాస‌న‌స‌భ‌లో ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్‌ను ప్ర‌వేశ పెట్టింది. ముఖ్య‌మంత్రి కేసీఆర్ ముందుగా పుల్వామా దాడిలో అమ‌రులైన జ‌వాన్ల‌కు నివాళుల‌ర్పిస్తూ..ఒక తీర్మానం చేశారు. ఒక్కో జావాన్ కుటుంబానికి రూ.25 ల‌క్ష‌ల ఆర్థిక సాయం ప్ర‌క‌టించారు. అలాగే రైతులకు రూ. ల‌క్ష వ‌ర‌కు రుణ‌మాఫీ చేశారు.

2019-20 ఆర్థిక సంవత్సరానికి రూ. 1,82,017 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్
∎రెవెన్యూ వ్యయం రూ. 1,32, 629 కోట్లు
∎మూలధన వ్యయం రూ. 32,815 కోట్లు
∎రెవెన్యూ మిగులు రూ. 6,564 కోట్లు
∎ఆర్థిక లోటు రూ. 27, 749 కోట్లుగా అంచనా
∎ఆసరా పింఛన్ల కోసం రూ. 12, 067కోట్లు


∎కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ రూ. 1,450 కోట్లు
∎నిరుద్యోగ భృతి రూ. 1,810 కోట్లు
∎మైనార్టీ సంక్షేమం రూ. 2,004 కోట్లు
∎రైతు రుణమాఫీ రూ. 6వేల కోట్లు
∎రైతు బీమా రూ. 650 కోట్లు
∎రైతు బంధుకు రూ. 12వేల కోట్లు
∎వ్యవసాయ శాఖకు రూ. 20, 107 కోట్లు


∎షెడ్యూలు కులాల ప్రగతి నిధి రూ. 16, 581 కోట్లు
∎బియ్యం రాయితీ రూ. 2,744 కోట్లు
∎షెడ్యూల్ తెగల ప్రగతి నిధి రూ. 9,827 కోట్లు
∎ఎంబిసి కార్పొరేషన్ కోసం రూ. 1000 కోట్లు
∎2018 డిసెంబర్ 11 నాటికి ఉన్న రూ. లక్ష వరకు పంట రుణాలు మాఫీ
∎నీటిపారుదల శాఖకు రూ. 22, 500 కోట్లు
∎ఈఎన్టీ, దంత పరీక్షలకు రూ. 5,536 కోట్లు


∎పంచాయతీలకు రెండు ఫైనాన్స్ కమిషన్ల నుంచి రూ. 3,256 కోట్లు
∎ఒక్కో మనిషికి రూ. 1606 చొప్పున ఫైనాన్స్ కమిషన్ నిధులు
∎500 జనాభా కలిగిన గ్రామానికి రూ. 8 లక్షల నిధులు
∎టిఎస్ఐపాస్ ద్వారా రూ. 1.41 లక్షల కోట్ల పెట్టుబడులు
∎టిఎస్ఐపాస్ ద్వారా 8, 419 పరిశ్రమలకు అనుమతులు
∎2017-18 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 10.4 శాతం


∎2017-18లో మొత్తం వ్యయం రూ. 1,43, 133 కోట్లు
2017-18లో రెవెన్యూ మిగులు రూ. 3, 459 కోట్లు
2018-19లో సవరించిన అంచనా వ్యయం రూ. 1,61,857 కోట్లు
2019-20లో సొంత రెవెన్యూ రాబడుల అంచనా రూ. 94, 776 కోట్లు
2019-20లో కేంద్రం నుంచి వచ్చ నిధుల అంచనా రూ. 22, 835 కోట్లు

Related Articles