NewsWaves.news

తెలంగాణ రైతుల‌కు రుణ‌మాఫి : కేసీఆర్‌

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఈ రోజు శాస‌నస‌భ‌లో ఓటాన్ ఎకౌంట్ బ‌డ్జెట్ ను ప్ర‌వేశ పెట్టారు. ఇందులో రైతులు తీసుకున్న రుణాల‌ను మాఫీ చేశారు. 2018 డిసెంబ‌ర్ లోపు రైతులు తీసుకున్న రుణాల్లో ల‌క్ష రూపాయ‌లు రుణ‌మాఫీ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు ముఖ్య‌మంత్రి. తెలంగాణ ప్ర‌భుత్వం రైతుల సంక్షేమానికి క‌ట్టుబ‌డి ఉంద‌ని..అన్న‌దాత‌ల‌ను అన్ని విధాలుగా ఆదుకుంటాం అని హ‌మీ ఇచ్చారు.

కీల‌కాంశాలు

∎వ్యవసాయ శాఖకు రూ.20,107 కోట్లు కేటాయింపు
∎ రైతు బంధు స్కీమ్‌లో అందించే మొత్తం రూ.8 వేల నుంచి రూ.10 వేల‌కు పెంపు
∎రైతు భీమా కోసం రూ.650 కోట్ల కేటాయింపు
∎రుణ‌మాపీకి రూ.6 వేల కోట్ల కేటాయింపు

Related Articles