NewsWaves.news

సమిష్టిగా ఆడితేనే ప్రపంచకప్:సచిన్

ఈనెల 30 నుంచి ప్రపంచ కప్ క్రికెట్ టోర్నీ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే ఈ రోజు భారత జట్టు ఇంగ్లాండ్ లో అడుగుపెట్టింది. ప్రపంచ కప్ గురించి క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ స్పందించారు. కోహ్లీ ఒక్కడు పోరాడడం వల్ల ప్రపంచకప్ గెలవలేమని జట్టు మొత్తం కలిసి కట్టుగా రాణిస్తేనే విజయం సాధ్యం అని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అన్నాడు.

టీమిండియా బ్యాటింగ్‌ ఆర్డర్‌లో నాలుగో స్థానం గురించి ఎక్కువగా చర్చ నడుస్తోంది. నా దృష్టిలో అది ఒక నంబర్‌ మాత్రమే. దాన్ని సమస్యగా పరిగణించాల్సిన అవసరం లేదు. మన జట్టులో ఎంతో మంది నాణ్యమైన బ్యాట్స్‌మెన్‌ ఉన్నారు. అవసరాన్ని బట్టి ఏ స్థానంలోనైనా ఆడేందుకు ప్రతి ఒక్క బ్యాట్స్‌మెన్‌ సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే మన ఆటగాళ్లు కావాల్సినంత క్రికెట్‌ ఆడారు’ అని సచిన్‌ పేర్కొన్నాడు.

భారత జట్టు మొత్తం బ్యాట్స్‌మెన్‌, బౌలర్లు, ఆల్‌ రౌండర్లతో సమతూకంగా ఉంది. అనుభవజ్ఞులతో పాటు సత్తా ఉన్న యువ ఆటగాళ్లు కూడా జట్టులో ఉండటం కలిసొచ్చే అంశం. ప్రపంచకప్‌ గెలిచే అవకాశాలు భారత్‌కే ఎక్కువగా ఉన్నాయి’ అని సచిన్‌ తెలిపాడు.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి