NewsWaves.news

వైయస్సార్ కాంగ్రెస్ గూటికి ఎంపీ అవంతి

విశాఖ జిల్లా అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ గూటికి చేరారు. గత ఎన్నికల్లో టీడీపీ తరపున ఎంపీగా గెలిచిన అవంతి.. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. భీమిలి ఎమ్మెల్యే టికెట్ తో పాటు అధికారంలోకి వస్తే మంత్రి పదవి కూడా ఇస్తానని జగన్ హామీ ఇవ్వడంతో అవంతి శ్రీనివాస్ పార్టీ మారినట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది.

వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరిన అనంతరం మీడియాతో మాట్లాడిన అవంతి శ్రీనివాస్.. రాష్ట్ర ప్రజలు చంద్రబాబు మాటలు విని విసిగిపోయారని, ప్రస్తుతం ఆయన మాటలు వినే పరిస్థితుల్లో లేరని అన్నారు. ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలను ప్రజలు నమ్మరని, ప్రత్యేక హోదా పై కూడా చంద్రబాబు మాట మార్చారని ఈ సందర్భంగా అవంతి శ్రీనివాస్ ఆరోపణలు చేశారు.

Related Articles