NewsWaves.news

టీడీపీ మేనిఫెస్టో కమిటీ భేటీ

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ మ్యానిఫెస్టోను రూపొందించేందుకు ఏపీ ముఖ్యమంత్రి, టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేశారు. టిడిపి సీనియర్ నాయకుడు రాష్ట్ర ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు మేనిఫెస్టో కమిటీకి అధ్యక్షుడిగా నియమితులయ్యారు.

ఈ మేనిఫెస్టో కమిటీ తొలిసారిగా నేడు సచివాలయంలో భేటీ కానుంది. మంత్రులు అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాసరావు, ఫరూక్,ఆనంద్ బాబు, కిడారి శ్రవణ్ సహా పలువురు టీడీపీ నేతలు ఈ కమిటీలో ఉన్నారు. ఎన్నికల నేపథ్యంలో అన్ని వర్గాల ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ కమిటీ మేనిఫెస్టో ని రూపొందిస్తుంది. ఈ నివేదికను ముఖ్యమంత్రి టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు కి సమర్పిస్తారు.

Related Articles