NewsWaves.news

ప్రాణం పోతున్నా.. డ్రైవింగ్ ఆప‌లేదు: 50 మంది ప్రాణాలు కాపాడిన డ్రైవ‌ర్‌

ప్రాణం పోతున్నా వృత్తి ధ‌ర్మాన్ని నిర్వ‌ర్తిస్తూ 50 మంది ప్రాణాలు కాపాడాదు ఒక డ్రైవ‌ర్‌. త‌మిళ‌నాడులోని వెల్లూరు జిల్లా పెరంబ‌ట్టులో ఉండే ర‌మేష్ అనే వ్య‌క్తి త‌మిళ‌నాడు రాష్ట్ర రవాణా సంస్థలో డ్రైవర్ గా ప‌ని చేస్తున్నాడు.

అయితే ప్ర‌తీరోజు లాగే 50 మంది ప్ర‌యాణికుల‌తో గ‌మ్య‌స్థానం వైపు బ‌స్సును తీసుకెళ్తున్నాడు. అంత‌లోనే ఒక్క‌సారిగా గుండెపోటు వ‌చ్చింది. ఆ నొప్పిని భ‌రిస్తూనే బ‌స్సును ప‌క్క‌కు ఆపాడు. అయితే నొప్పి తీవ్ర స్థాయిలో ఉండటంతో స్టీరింగ్ పై పడిపోయాడు. దీంతో స్థానికులు అత‌న్ని అసుప‌త్రికి త‌ర‌లించ‌గా.. అప్ప‌టికే ర‌మేష్ మ‌ర‌ణించాడ‌న్నాడు డాక్ట‌ర్‌. ప్రాణం పోతున్నా విధిని నిర్వ‌ర్తించి 50 మంది ప్రాణాలు కాపాడిని ర‌మేష్‌ను అంద‌రూ మెచ్చుకుంటున్నారు.

Related Articles