NewsWaves.news

మెగా హీరోతో తమిళ స్టార్

మెగా కుటుంబం నుంచి మరో హీరో రాబోతున్నారు.మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా ఒక చిత్రం తెరకెక్కుతుంది.బుచ్చిబాబు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది.ఈ చిత్రంలో తమిళ స్టార్ విజయ్ సేతుపతి నటిస్తున్నాడు.విషయాన్ని చిత్ర బృందం శనివారం రోజు ధ్రువీకరించింది. ఈ స్టార్ హీరో ఈ సినిమాలో కథానాయకుడి పాత్రను పోషిస్తున్నారు అని వార్తలు వస్తున్నాయి. అయితే విజయ్ సేతుపతి ఇంతకుముందు మెగాస్టార్ చిరంజీవితో “సైరా నరసింహారెడ్డి” లో నటిస్తున్న విషయం తెలిసిందే కాగా ఇతనికి ఈ సినిమా రెండవది .మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు .దేవి శ్రీ ప్రసాద్ సినిమాకు బాణీలు అందిస్తున్నారు.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి