NewsWaves.news

చంద్ర‌బాబుపై ఫైరైన త‌ల‌సాని

ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబుపై తెలంగాణ శాసన స‌భ్యుడు త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ ఫైర‌య్యారు. చంద్ర‌బాబు చిల్ల‌ర రాజ‌కీయాలు చేస్తున్నార‌న్నారు త‌ల‌సాని. విజ‌య‌వాడ ప‌ర్య‌టించిన త‌ల‌సాని మీడియాతో మాట్లాడుతూ..ఏపీ ప్ర‌జ‌లు ప్ర‌త్యామ్నాయ ప్ర‌భుత్వాన్ని ఎంచుకోవాల్సిందిగా సూచించారు. ప్ర‌స్తుతం ఏపీలో ప్ర‌భుత్వం ప‌నితీరు స‌రైన విధంగా లేద‌న్నారు. ఒక వైపు 16 వేల కోట్ల లోటు బ‌డ్జెట్ ఉంద‌ని చెబుతూనే మ‌రో వైపు డ‌బ్బు వేస్ట్ చేస్తుర‌న్నారు త‌ల‌సాని. ధర్మపోరాట దీక్షలకు ప్రజాధనాన్ని ఖర్చు చేయడం అవసరమా..? అని ఈ సందర్భంగా సిఎం చంద్రబాబును ఆయన ప్రశ్నించారు.

Related Articles