NewsWaves.news

చంద్రబాబు పై కేసు వేస్తా : స్వరూపానంద సరస్వతి

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డుపై, తెలుగుదేశం పార్టీ పాలనపై విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి తీవ్ర ఆరోపణలు చేశారు. టీటీడీ పాలన లోపభూయిష్టంగా ఉందని, ఆలయ భూములు అన్యాక్రాంతం అయ్యాయని, వాటిని సంబంధించిన అన్ని ఆధారాలు తన దగ్గర ఉన్నాయని స్వరూపానందేంద్ర అన్నారు.

త్వరలోనే టీటీడీ అధికారులపైన, ముఖ్యమంత్రి పైన కేసు వేస్తానని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో అవినీతి తారా స్థాయికి చేరిందని, ప్రభుత్వ మార్పు కోసం త్వరలోనే రాజశ్యామల యాగం చేస్తానని ఆయన అన్నారు. తెలంగాణలో కేసీఆర్ అధికారంలోకి రావడానికి తాను జరిపించిన రాజశ్యామల యాగమే కారణమని స్వరూపానందేంద్ర తెలిపారు.

Related Articles