NewsWaves.news

రాహుల్ పై పరువునష్టం వేస్తానంటున్న సుశీల్ కుమార్…

బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పై పరువునష్టం దావా వేస్తానని తెలిపారు. దొంగలందరూ కూడా మోడీ అనే ఇంటి పేరుతోనే ఉన్నారని తాజాగా ఒక ఎన్నికల ప్రచార సభలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై సుశీల్ కుమార్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాహుల్ అన్న మాటలు తామందరిని అవమానపరిచేలా ఉన్నాయని, తమ భావోద్వేగాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని ఆయన వెల్లడించారు.

ఆ కారణంచేతే త్వరలో పాట్నా హైకోర్టు లో రాహుల్ గాంధీపైన పరువు నష్టం దావా వేయనున్నానని సుశీల్ కుమార్ మోడీ ప్రకటించారు. అయితే రాహుల్ అలా మాట్లాడడం నేరమా అని మీడియా సుశీల్ కుమార్ ని ప్రశ్నించగా, మోడీ అనే ఇంటి పేరు ఉండడమే మేం చేసిన తప్పా అని సుశీల్ కుమార్ తిరిగి మీడియాను ప్రశ్నించారు.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి