NewsWaves.news

ఆధారాలు అందజేస్తే బాబు ప్రభుత్వంపై సిబిఐతో విచారణ…. సునీల్ దేవధర్

చంద్రబాబు ప్రభుత్వ అవినీతికి సంబంధించి జగన్ ప్రభుత్వం కేంద్రానికి ఆధారాలు అందుచేతే కనుక సీబీఐతో విచారణ చేయిస్తామని బీజేపీ ఏపీ ఇన్‌చార్జి సునీల్‌ దేవదర్‌ వెల్లడించారు. నేడు రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా లూటీ చేసిన చంద్రబాబు జైలుకెళ్లాల్సిందే అంటూ తీవ్రస్థాయిలో ఆయన ధ్వజమెత్తారు.కొత్తగా ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడిన జగన్‌ పరిపాలనను ఏడాదిన్నరపాటు గమనిస్తామని తెలిపిన ఆయన…

సీఎం జగన్ విధానాన్ని గమనించి, ఆయనకు సహకరిస్తామని తెలియజేశారు.అంతే కాకుండా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆంధ్రా కోడలని ఆయన వ్యాఖ్యానించారు. ఆమె రూపంలో ఆంధ్ర ప్రదేశ్లో లక్ష్మీదేవి ఉన్నట్టేనని సునీల్‌ అన్నారు. ఇక టీడీపీ, జనసేన పార్టీల నుంచి వచ్చే నేతల కోసం ఏపీలో బీజేపీ తలుపులు ఎల్లవేళల తెరిచే ఉంటాయని ఆయన తెలిపారు.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి