NewsWaves.news

లోక్ సభకు పోటీ చేయనున్న సుమలత…

కన్నడ సినీ నటుడు, ఎంపీ అంబరీష్ సతీమణి,సినీనటి సుమలత రానున్న ఎన్నికల్లో లోక్ సభ బరిలో దిగనున్నారు.కర్ణాటక రాష్ట్రంలోని మాండ్య నియోజకవర్గం నుంచి సుమలత పోటీ చేయనున్నట్లు గా ప్రకటించారు. కాగా సుమలత కాంగ్రెస్ పార్టీ తరుపున గానీ లేదా జెడిఎస్ తరుపున గాని పోటీ చేసే వీలు ఉంది.ఈ రెండు పార్టీలలో కాంగ్రెస్ వైపే ఆమె ఎక్కువగా ప్రాముఖ్యత చూపుతున్నట్లుగా తెలుస్తోంది.

అంబరీష్ మరణించిన తర్వాత ఆయన ఫ్యాన్స్ అలాగే కాంగ్రెస్ పార్టీ వారు కూడా సుమలత పాలిటిక్స్ లోకి రావాలంటూ కోరుతున్నట్లుగా సమాచారం.అంతేకాకుండా బెంగుళూరులో ఉన్నటువంటి సుమలత ఇంటికి వెళ్లి మరీ పార్టీ తరపున పోటీ చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆమెను కోరుతున్నారు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే పోటీకి దిగుతున్నట్లుగా సుమలత ప్రకటించారు.

ఇక ఇప్పుడు సుమలత పోటీ చేయనున్న మాండ్య నియోజకవర్గం నుండే గతంలో ఆమె భర్త కూడా ప్రాతినిధ్యం వహించారు. ఆ నియోజకవర్గంలో అంబరీష్కి బలమైన క్యాడర్ ఉండడంతో అది ఇప్పుడు సుమలత గెలుపుకి ఎక్కువగా ఉపయోగపడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

Related Articles