NewsWaves.news

పెద్దలు ఒప్పుకోకుంటే పెళ్లి లేదు… పదివేల విద్యార్థులతో ప్రమాణం…

కొద్ది గంటల్లో ప్రేమికుల రోజు రానుంది. లవర్స్ డే రోజు ఓవైపు యువ జంటల ఉత్సాహం కనిపిస్తే.. మరోవైపు జంటగా కనిపిస్తే చాలు పెళ్లి చేస్తామనే వారు కనిపిస్తుంటారు. అయితే ఈ రెండింటికీ భిన్నంగా లవర్స్ డే రోజున సూరత్ లో ఒక కార్యక్రమం జరగనుంది. పదివేల మంది విద్యార్థులతో “మేము పెద్దలను ఎదిరించి ప్రేమ పెళ్లి చేసుకోమంటూ”.. ప్రమాణం చేయించడం ఆ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ఈ కార్యక్రమాన్ని ఒక స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తోంది.

ఈ సంస్థకు సంబంధించిన సభ్యుడు ఒకరు ఈ విషయం గురించి మాట్లాడుతూ…ప్రేమించి, పెద్దలని ఎదిరించి పారిపోయి పెళ్లి చేసుకోవడం ఈ మధ్య ఎక్కువగా జరుగుతుందని,అలా పెళ్లి చేసుకున్న వాళ్లు ఆనందంగా ఉంటే పరవాలేదు కానీ పెళ్లి చేసుకుని ఆరు నెలలు తిరక్కముందే విడాకులు తీసుకుంటున్నారని అన్నారు.

అంతేకాకుండా ఎదురించి పెళ్లి చేసుకున్నారంటూ పెద్దలు వారిపై దాడి చేసే సంఘటనలను కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నామని, ఇలాంటి సమస్యలు రాకూడదనే సదుద్దేశంతోనే దాదాపుగా 12 పాఠశాలల నుంచి పది వేలకు పైగా విద్యార్థులతో “తల్లిదండ్రులు ఒప్పుకోకుండా ప్రేమ వివాహం చేసుకోమంటూ”.. ప్రతిజ్ఞ చేయిస్తున్నామని వివరించారు.

Related Articles