NewsWaves.news

వీకెండ్ రోజున లాభాల్లో స్టాక్ మార్కెట్లు

వీకెండ్ రోజున స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 165 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ 47 పాయింట్లు లాభపడింది. పలు కార్పొరేట్ కంపెనీల త్రైమాసిక ఫలితాల సీజన్ మొదలు కావడంతో..ప్రారంభంలో ఇన్వెస్టర్లు ఆచితూచి స్పందించారు. అయితే అనూహ్యంగా మార్కెట్ చివరి గంటలలో ఆటోమొబైల్ షేర్లలో కొనుగోళ్లు వెల్లువెత్తడంతో సూచీలు లాభాల బాట పట్టాయి.

మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 38,767 పాయింట్ల వద్ద, నిఫ్టీ 11,643 పాయింట్ల వద్ద స్థిరపడ్డాయి. మరోవైపు డాలర్ తో రూపాయి మారక విలువ 69.22 కొనసాగుతోంది. ఈరోజు స్టాక్ మార్కెట్ లో ఐటిసి, మారుతి సుజుకి, జీ ఎంటర్టైన్మెంట్, సిప్లా షేర్లు లాభాల బాట పట్టగా టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి