NewsWaves.news

శ్రీనివాస్ రెడ్డి ఒక మానవమృగం.

యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన వరుస హత్యలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే .వరుస హత్య కేసుల మిస్టరీని పోలీసులు ఛేదించారు .శ్రావణి ,మనీషా, కల్పన లని హత్య చేసింది మర్రి శ్రీనివాసరెడ్డి అని తేల్చారు.

ఈ ముగ్గురు బాలికలపై అత్యాచారం చేసి ఆపై హత్య చేసినట్లు తెలిపారు. విపరీతమైన ఉన్మాద ప్రవర్తనతోనే ఘాతుకానికి పాల్పడ్డారని రాచకొండ పొలీస్ కమిషనర్ మహేష్ భగవత్ వెల్లడించారు. 2015 లో బొమ్మల రామారం లో ఓ యువతిపై లైంగిక దాడికి పాల్పడడంతో గ్రామస్తులంతా అతన్ని పట్టుకుని చెట్టుకు కట్టేసి కొట్టారు .అతన్ని ఆ సంఘటన ఉన్మాదిగా మార్చేసింది. దాంతో ఒక రకమైన కోపంతో ఉన్మాదిగా మారి బాలికలపై అత్యాచారం హత్యలకు పాల్పడినట్లు నిందితుడు అంగీకరించాడు .

Psycho Killer Srinivas Reddy Arrested

అతను ఒక అమ్మాయితో పెళ్లి ఏర్పాట్లలో ఉన్నారని తెలిపారు.ఇంతకుముందు శ్రీనివాస్ రెడ్డి కి పలు కేసులు ఉన్నట్టు పోలీసులు తెలిపారు.కర్నూలులో వేశ్య హత్య కేసులో ముద్దాయిగా ఉన్నాడు.దారిలో వెళుతుoడే బాలికలకు లిఫ్ట్క్ ఇచ్చి ,పక్కనే ఉన్న బావి దగ్గరికి తీసుకెళ్లి అందులో తోసేసి వారు గాయాలతో ఉన్నప్పుడే వారిపై అత్యాచారానికి పాల్పడేవాడు.ఉరిశిక్ష పడేలా అన్ని ఆధారాలు సేకరిస్తాం అని రాచకొండ పోలీస్ కమిషనర్ పేర్కొన్నారు.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి