NewsWaves.news

నా భార్య వ‌ల్లే అలా చేశాను : శ‌్రీశాంత్‌

మాజీ క్రికెట‌ర్ శ్రీశాంత్ కెరీర్ ఆరంభం నుంచే ఏదో ఒక వివాదంలో ఉంటూనే ఉన్నాడు. స్పాట్ ఫిక్సింగ్ వివాదం శ్రీ క్రికెట్ కెరీయ‌ర్‌ను అంతం చేసింది. దాంతో సినిమాలు, రియాల్టీ షోల‌పై దృష్టి పెట్టాడు. అందులో భాగంగానే బిగ్‌బాగ్ 12వ‌ సీజ‌న్ లో పాల్గొని ర‌న్న‌ర‌ప్ గా నిలిచాడు. షో జ‌రిగినంత కాలం… తోటి కంటెస్టెంట్ దీపికా క‌క్క‌ర్‌ను త‌న చెల్లిగా భావించి అప‌రూపంగా చూసుకున్నాడు. షో త‌ర్వాత కూడా ఈ కొత్త అన్నా చెల్లెలి అనుబంధం అలాగే కొన‌సాగుతుందేమో అనుకున్నారు. కానీ అలా జ‌ర‌గ‌లేదు.

షో నుంచి బ‌య‌టికి వ‌చ్చిన కొంత కాలం త‌ర్వాత కక్క‌ర్ ను ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేశాడు శ్రీశాంత్‌. ఇలా చేయ‌డానికి కారణం కూడా చెప్పాడు. త‌న భార్య‌ను దీపికా క‌క్క‌ర్ అన్‌ఫాలో చేసింద‌ని. త‌న భార్య‌ను గౌర‌వించ‌న వ్య‌క్తిని తాను ఎలా గౌర‌విస్తాన‌ని.. అందుకే అన్ ఫాలో చేశాన‌ని వివ‌ర‌ణ ఇచ్చాడు.

Related Articles