NewsWaves.news

సాఫ్రాన్ పులావ్‌

పులావ్ అనగానే చాలారకాలుగా చేస్తూ ఉంటాం . అందులోను ఎక్కువగా వెజ్ , నాన్ వెజ్ లో చాలారకాల పులావ్ లు ఉన్నాయి . ఈ రెండు కాకుండా ఇంకాస్త టేష్టి గ వుండే పులావ్ ఈరోజు ఎలా తయారు చేయాలో చూద్దామా …

కావలసిన పదార్ధాలు :బాస్మతి రైస్ 3 గ్లాసులు ,ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు ,పచ్చిమిర్చి  3,అల్లం వెల్లులి పేస్ట్ 2 స్పూన్స్ ,కొత్తిమీర గుప్పెడు ,పుదీనా గుప్పెడు ,లవంగాలు 5,ఇలాచీ 4,బిర్యానీపువ్వు1,బ్లాక్ ఇలాచీ  1,జవిత్రి   1,బిర్యానీ ఆకు 1 ,దాల్చిని చక్క  3,కుంకుమ పువ్వు ,.ఆయిల్, నెయ్యి ,ఉప్పు .

తయారుచేసే విధానం : ముందుగా కుంకుమ పువ్వుని నీళ్లలో నానపెట్టుకోవాలి . ఇప్పుడు  మనం తీసుకున్న పదార్ధాలన్నీ 3 గ్లాసుల రైస్ కి సరిపోతుంది . రైస్ ఎక్కువ పెంచుకునేకొద్దీ పదార్ధాలుకూడా కొంచం ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది .స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని వేడినతర్వాత 3 స్పూన్లనేయ్యి  2 స్పూన్ల నూనె  వేడైన తర్వాత బిర్యానీ ఆకు ,జవిత్రి ,దాల్చినచెక్క ,ఇలాచీ ,బిర్యానీ పువ్వు ,లవంగాలు వేసి కొంచం ఫ్రై చెయాలి ..కాస్త వేగినతర్వాత కాస్త సిం లో పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కూడా వేసి ఇంకాస్త ఫ్రై చెయాలి .తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లులి పేస్ట్ వేసి ఫ్రై అయినతరువాత పుదీనా, అలాగే కొత్తిమీర వేసి వేగినతర్వాత కడిగిపెట్టుకున్న బాసుమతి రైస్ వేసి తగినన్ని నీళ్ళుపోసి అంటే 3 గ్లాసుల రైస్ కి అదే గ్లాసుతో 6 గ్లాసులనీళ్ళు సరిపోతుంది .కొద్దిగా సరిపడా ఉప్పు వేసి కలిపి చివరగా నానపెట్టిన కుంకుమపువ్వు వేసి మూతపెట్టేసి కాస్త ఉడికిన తర్వాత స్టవ్ సిం లో ఉంచి 15 నిమిషాలతర్వాత ఉడకనివ్వాలి . రైస్ ఉడుకుతున్నపుడు ఎక్కువగా స్పూనుతో కలపకూడదు ఎందుకంటే బాస్మతి రైస్ ఎక్కువగా కలిపితే మెత్తగా అయిపోతుంది .15 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి .అంతే యమ్మీ యమ్మీ జాఫ్రాని పులావ్ రెడీ …     

Related Articles