NewsWaves.news

పాలక్ సూప్

పాలకూర హెల్త్ కి చాల ఉపయోగపడుతుంది ..పాలకూరలో విటమిన్ సి ,విటమిన్ ఏ ,విటమిన్ కే మెగ్నీషియం వున్నాయి . పాలకూర లో ఎక్కువశాతం వాటర్ ఉంటుంది . డైట్ చేసేవారు ఎక్కువగా పాలకుర తీసుకోవటం వల్ల ఎక్కువ క్యాలరీస్ వుండవుకాబట్టి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికీ చాల మంచి సూప్ . పాలక్ సూప్… 

కావాల్సిన పదార్ధాలు : పాలకూర ,బట్టర్ ,అల్లం ,వెల్లులి ,మిరియాల పొడి, రాక్ సాల్ట్, మిల్క్ ,కార్న్ ఫ్లోర్, చల్లటి నీళ్లు.తయారు చేసే విధానం : ముందుగా పాలకూరను బాగా కడిగి కట్ చేసి పెట్టుకోవాలి .స్టవ్ ఆన్ చేసుకుని బౌల్ పెట్టి అందులో కొన్ని నీళ్లు పోసి వేడినతర్వాత పాలకురవేసి 2 నిమిషాలతర్వాత తీసేసి చల్లటి నీళ్లలో వేసుకోవాలి .చల్లటి నీళ్లలో వేయటం వల్ల గ్రీన్ కలర్ పోకుండా ఉంటుంది .

స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని కొద్దిగా బట్టర్ వేసుకోవాలి కాస్త వేసినతర్వాత 5 వెల్లులిరెబ్బలు ,అల్లం ముక్కలు వేసి కాస్త వేగనివ్వాలి తర్వాత చల్లటినీళ్లలో వేసుకున్న పాలకూరని వడకట్టాలి .నీళ్లలో వేస్తాం కాబట్టి . ముందుగా వేయించుకున్న అల్లం వెల్లులి అలాగే  పాల కూర ని  మిక్సీలో వేసి కాస్త నీళ్లు వేసి మెత్తగా పేస్ట్ ల చేసుకోవాలి .మల్లి స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని మిక్స్ వేసుకున్న పాలకూర  లిక్విడ్ ని వేసి అందులో కొద్దిగా మిరియాలపొడి వేసుకోవాలి .. 5 నిముషాలు బాగా బాయిల్ అవనివ్వాలి .

లాస్ట్ లో కొద్దిగా కావలసినంత ఉప్పు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి … కాస్త చిక్కగా కావాలనుకున్నవాళ్ళు కార్న్ ఫ్లోర్ 2 స్పూన్లు గిన్నెలోకి తీసుకుని కొద్దిగా నీళ్ళుపోసి పలుచగా చేసుకోవాలి . తర్వాత బాయిల్ అవుతున్న పాలక్ సూప్ లో వేసి 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంటే ఎంతో రుచుగ వుండే పాలక్ సూప్ రెడీ … 

Related Articles