NewsWaves.news

స్పెషల్ గుత్తి వంకాయ కూర


కావల్సిన పదార్థాలు: పల్లీలు ,తెల్ల నువ్వులు, ధనియాలు , లవంగాలు 5,యాలకులు 2, దాల్చినచెక్క చిన్న ముక్కలు 2, ఎండుమిర్చి6,కరివేపాకు కొత్తిమీర, గుత్తి వంకాయలు అల్లంవెల్లల్లి పేస్ట్, ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు.

తయారుచేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని కొద్దిగా నూనె వేసుకుని వేదిన తరవాత పల్లీలు వేసే వేయించి పక్కన పెట్టుకోవాలి.అలాగే ఎండుమిర్చి,తెల్ల నువ్వులు, ధనియాలు,లవంగాలు, యలుకలు,దాల్చిన చెక్క వేసి విడి విడి గా వేయించి పక్కనపెట్టి కాస్త చల్లారాక అన్నికలిపి మిక్సి వేసి పేస్ట్ లా చేసుకోవాలి .మరో పాన్ పెట్టుకుని నూనె వేసి వేడిఅయ్యాక గుత్తి వంకాయలను మధ్యలో పూర్తిగా కాకుండా నాలుగు ముక్కలుగా కట్ చేసుకుని నూనెలో వేసి కాస్త వేగనిచ్చి పక్కన పెట్టుకోవాలి.

అదే పాన్ లో కొద్దిగా ధనియాలు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు,వేసి కాస్త వేగాక తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించి అందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి.2 నిమిషాల తరువాత ముందుగా మిక్సి వేసి పెట్టుకున్న పేస్ట్ ను వేసి బాగా కలిపి 4 నిమిషాల పాటు మూతపెట్టి ఉడికించాలి .

తర్వాత కొద్దిగా పెరుగు వేసి కలిపి ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న వంకాయలు కూడా వేసి కలిపి మూత పెట్టేసి మరో 5 నిమిషాలు ఉంచాలి మసాల అంతా వంకాయలకు పట్టి మంచి టెస్ట్ వస్తుంది…చివరగా కొత్తమీరతో గార్నిష్ చేసి వేడివేడిగా సర్వ్ చేయండి.అంతే ఎంతో రుచికరమైన గుత్తి వంకాయ కూర రెడీ.

Related Articles