NewsWaves.news

రాహుల్ గాంధీ నాయకత్వంలో పార్టీ కి కొత్త ఉత్సాహం… సోనియా గాంధీ

ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పార్టీ ఎంపీలతో నిర్వహించినటువంటి సమావేశంలో పాల్గొన్న యూపీఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ మాట్లాడుతూ.. రాహుల్ పై ప్రశంసలు కురిపించారు.తమను ఓడించే వారు లేరన్న భావనలో ఉన్న బిజెపి అహంకారాన్ని..కాంగ్రెస్ పార్టీ ప్రజల సహకారంతో ఎదుర్కొందని అన్నారు.

మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందని, రాహుల్ నేతృత్వంలో ..పార్టీ నూతన జవసత్వాలతో మరింతగా బలపడిందని సోనియా అన్నారు.

పాతతరం, కొత్త తరం నాయకులను కలుపుకుని రాహుల్ గాంధీ పార్టీని ముందుకు తీసుకు వెళ్తున్నారని,పార్టీ భావజాలాన్ని, అజెండాను పంచుకునే ఇతర పార్టీలను సైతం తనతోపాటు కలిసి తీసుకెళ్తున్నారని రాహుల్ ని ప్రశంసించారు సోనియా. రానున్న లోక్ సభ ఎన్నికల్లో కూడా విజయాన్ని సాధించాలని తాను కోరుకుంటున్నానని తెలిపారు సోనియా.

Related Articles