NewsWaves.news

నామినేషన్ వేసిన సోనియా గాంధీ

యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలి నియోజకవర్గానికి ఈరోజు నామినేషన్ వేశారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సోనియాగాంధీ రాయ్ బరేలి పార్లమెంట్ నియోజకవర్గం నుండి బరిలోకి దిగుతున్నారు. ఈ నియోజకవర్గం నుండి సోనియాగాంధీ ఇప్పటికే నాలుగు సార్లు విజయం సాధించారు. సోనియాగాంధీ నామినేషన్ వేసే సమయంలో ఆయన కుమారుడు.. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంక గాంధీ వెంట ఉన్నారు.

నామినేషన్ అనంతరం మీడియాతో మాట్లాడిన సోనియాగాంధీ 2004లో వాజ్ పేయి జీ పైన గెలుపొందామని, అటువంటి తమకు నరేంద్ర మోడీని ఓడించడం కష్ట సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ కూడా మీడియాతో మాట్లాడారు. భారత ప్రజల కంటే తాము గొప్ప అని భావించిన వారు భారత చరిత్రలో చాలామంది ఉన్నారని, గత ఐదేళ్లలో మోడీ భారత ప్రజలకు ఏమీ చేయలేకపోయారని, ఆయన సామర్థ్యాన్ని ఎన్నికల ఫలితాల తర్వాత మీరే చూస్తారని రాహుల్ వ్యాఖ్యానించారు.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి