NewsWaves.news

వార‌ణాసిలో స్టూడెంట్ కాల్చివేత : ప‌రిస్థితి ఉద్రిక్తం

వార‌ణాసికి చెందిన బీకామ్ స్టూడెంట్ వివేక్ సింగ్ అనుమానాస్ప‌ద మృతితో న‌గ‌రంలో ప‌రిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో ప‌రిస్థితిని అదుపులో తీసుకురావ‌డానికి పోలీసులు రంగంలోకి దిగారు.

వివేక్ సింగ్ మృతికి కార‌ణం ఏంటో ప‌క్కాగా తెలియ‌క‌పోయినా… పాత గొడ‌వ‌ల వల్లే గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు వివేక్‌ను కాల్చి చంపార‌ని పోలీసులు ప్రాథ‌మిక ద‌ర్యాప్తులో తేల్చారు. అనుమానితుల కోసం పోలీసులు వెతుకుతున్నారు.

పాత కార‌ణాల వ‌ల్లే వివేక్‌ను హత్య చేశార‌ని తెలుస్తోంది. ఈ మిస్ట‌రీని తేల్చ‌డానికి 7 టీమ్స్‌ను ఏర్పాటు చేశాము. త్వ‌ర‌లోనే నిజాలు బ‌య‌టికి తెస్తాము.. ప్ర‌స్తుతం ప‌రిస్థితి అదుపులో ఉంద‌ని .. పోలీసు ఉన్న‌తాధికారులు తెలిపారు.

Related Articles