NewsWaves.news

ఇండియాస్ బెస్ట్ కంపెనీగా సింగరేణి…

రాష్ట్ర ఆదాయ వనరులలో ముఖ్యమైన వాటిలో ఒకటి సింగరేణి. ఈ సంస్థ ఎంతోమంది కార్మికులకు ఉపాధి కల్పిస్తోంది. అటువంటి సింగరేణి సంస్థ ప్రతిష్టాత్మకమైన అవార్డును సొంతం చేసుకుంది. ఇండియాస్ బెస్ట్ కంపెనీగా సింగరేణి నిలిచింది. 2018 సంవత్సరానికి గాను ఇండియాస్ బెస్ట్ కంపెనీ అవార్డుని ఈ సంస్థ కైవసం చేసుకుంది.

అమెరికాకు చెందినటువంటి ప్రముఖ బహుళజాతి వాణిజ్య వ్యాపార సంప్రదింపుల సంస్థ బెర్క్ షైర్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ వారు ఈ అవార్డును ప్రకటించారు. ఈ అవార్డు రావడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తూ.. టిఆర్ఎస్ పార్టీ తన అధికారిక ట్విట్టర్లో ఈ విషయాన్ని పోస్ట్ చేసింది.

Related Articles