NewsWaves.news

శుభ‌ల‌గ్నం సీక్వెల్‌లో జ‌గ‌ప‌తిబాబు

విల‌న్‌గా దూసుకెళ్తోన్న జ‌గ‌ప‌తి బాబు మ‌రోసారి హీరోగా సంద‌డి చేయ‌నున్నాడు. జ‌గ‌ప‌తిబాబుని ఫ్యామిలీ హీరోగా నిల‌బెట్టిన సూప‌ర్ హిట్ చిత్రం శుభ‌ల‌గ్నంతో మ‌రో సారి హీరోగా రీఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడ‌ట‌ జ‌గ్గూ భాయ్‌. తాజా స‌మాచారం ప్ర‌కారం ఎస్వీ కృష్ణారెడ్డి డైర‌క్ట్ చేసిన శుభ‌ల‌గ్నం సినిమా కొన‌సాగింపు చిత్రం చేయ‌డానికి జ‌గ‌ప‌తి బాబు స‌రేన‌న్నాడ‌ట‌.

డ‌బ్బు పిచ్చి ప‌ట్టిన ఒక వివాహిత.. డ‌బ్బు కోసం సొంత భ‌ర్త‌నే ఇంకో మ‌హిళ‌కు అప్ప‌గించేసి.. ఆ త‌ర్వాత త‌న త‌ప్పును తెలుసుకుంటుంది. అయితే జ‌గ్గూ భాయ్ ఈ సినిమా చేయ‌నున్నాడ‌ని వార్త‌లు వ‌స్తున్నా.. ఇంకా ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌లేదు. గ‌తంలో గాయం సినిమాకు సీక్వెల్‌లో న‌టించిన జ‌గ‌ప‌తిబాబు మ‌రో ఫ్లాప్ అందుకున్నాడు. మ‌రి ఇప్పుడు శుభ‌గ‌ల్నం సినిమా పార్ట్ 2 వ‌స్తే ఎలా ఉంటుందో..చూడాలి మ‌రి.


Related Articles