NewsWaves.news

అమెరికాలో కాల్పుల కలకలం…

అమెరికాలో తుపాకీ కాల్పుల కలకలం సృష్టించాయి.మధ్య ఇండియానాలోని బాల్ స్టేట్ యూనివర్సిటీకి దగ్గరలో ఈ కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఏడుగురు గాయపడ్డారు. అర్థరాత్రి ఒకటి తర్వాత ఈ కాల్పులు జరిగాయని పోలీసులు వెల్లడించారు.క్యాంపస్ కు దగ్గరలో ఒక హౌస్ పార్టీలో ఈ కాల్పులు జరిగినట్లు తెలిపారు. ఈ కాల్పులలో గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు వెల్లడించారు.

కాల్పులలో గాయపడినవారిలో కొందరు బాల్ స్టేట్ విద్యార్థులు. ఈ కాల్పులకు పాల్పడిన దుండగుడిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు ప్రకటించారు. అయితే ఈ కాల్పులను ఎందుకు జరిపాడో దాని వెనుక ఉద్దేశ్యం ఏమిటో తెలుసుకునే దిశగా దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.క్యాంపస్ లోని విద్యార్థులు ఇటువంటి ఆందోళనకు గురికావొద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి