NewsWaves.news

వైకాపాకు షాక్…ఇద్ద‌రు మాజీ ఎమ్మెల్యేల బైబై

ఇద్ద‌రు టీడీపీ సీనియ‌ర్ల వ‌ల‌స‌ల ఊపుతో హుషారుగా ఉన్న వైకాపాకు, ఆ ఆనందం ఎంతో సేపు నిల‌వ‌లేదు. ఊహించ‌ని షాక్ త‌గిలింది. నెల్లూరు జ‌ల్లాలో ఇద్ద‌రు మాజీ ఎమ్మెల్యేలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనుంచి వైదొల‌గారు. మాజీ ఎమ్మెల్యేలు వంటేరు వేణుగోపాల్ రెడ్డి, విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డి వైకాపాకు రాజీనామా చేశారు. కావలి నియోజ‌క‌వ‌ర్గ టికెట్ ఆశించిన వీరికి, అవి ద‌క్క‌క‌పోవ‌డంతో కినుక వ‌హించారు.

కావ‌లిలో పోటీ చేసేందుకు త‌న‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని చాలారోజులుగా వేణుగోపాల్ రెడ్డి అధిష్ఠానంపై ఒత్తిడి తెస్తున్నారు. త‌న‌కు టికెట్ ఇవ్వ‌క‌పోతే పార్టీకి రాజీనామా చేస్తాన‌ని కూడా బెదిరించారు. త‌న బ‌లం, బ‌లగం చూపుతానంటూ కావ‌లిలో పెద్ద ర్యాలీ నిర్వ‌హించారు. అయితే పార్టీ అధిష్ఠానం నుంచి ఎటువంటి స్పంద‌న కాన‌రాక‌పోవ‌డంతో ఈ ఇద్ద‌రు నాయ‌కులు వైకాపాకు గుడ్ బై చెప్పారు.

Related Articles