NewsWaves.news

ప్రధాని ప్రశంస అవసరం లేదు… శివ ప్రసాద్

ప్రధాని మోదీ.. ఎంపీ శివప్రసాద్ మంచి నటుడని, పార్లమెంట్ కి రకరకాల రూపాల్లో, వేషధారణలో వచ్చి అందరినీ నవ్విస్తూ ఉండే వారని ప్రశంసించారు. 16వ లోక్ సభ చివరి సమావేశం సందర్భంగా మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు తాను ఎన్నో సార్లు సభకు టెన్షన్ తో వచ్చినా కూడా శివ ప్రసాద్ ని చూడగానే అన్ని టెన్షన్స్ మర్చి పోయేవాడిని అని మోడీ అన్నారు.

అయితే దీనిపై స్పందించారు శివప్రసాద్. ప్రధాని ప్రశంస తనకు అవసరం లేదని అన్నారు.మోడీ తనకు గొప్ప ప్రశంసను ఇచ్చారని, కానీ ఆయన ప్రశంస తనకు అవసరం లేదని, ఒకవేళ మోడీ వ్యంగ్యంగా మాట్లాడినా లేదా ఎలా మాట్లాడినా కూడా ఆయన పొగడ్త మాత్రం తనకు అవసరం లేదని శివప్రసాద్ అన్నారు. అందర్నీ ఎగతాళి చేసినట్లుగా కళల గురించి మోడీ మాట్లాడలేకపోయాడు అని ఆయన అన్నారు.

కేవలం ఏపీ సీఎం చంద్రబాబు పోరాటానికి మద్దతుగా,ప్రత్యేక హోదా కోసం వివిధ వేషధారణలతో తన వంతు కృషి చేశానని,గిన్నిస్ బుక్ రికార్డు తనకు అవసరం లేదని, కేవలం ప్రజలకు మంచి జరిగి..ప్రజల ప్రేమ తనపై ఉంటే చాలు అని అన్నారు శివప్రసాద్.

Related Articles