NewsWaves.news

ఆర్ ఆర్ ఆర్ లో తారక్ సరసన ఆమె?

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో భారీ మల్టీస్టారర్ రూపుదిద్దుకుంటుంది .ఎన్టీఆర్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఆర్ ఆర్ ఆర్ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

అయితే ఎన్టీఆర్ సరసన నటించే హీరోయిన్ పాత్రకు కోసం చిత్ర యూనిట్ గత కొద్ది రోజులుగా వేట ప్రారంభించింది. చివరికి నిత్యా మీనన్ ఎన్టీఆర్ సరసన నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.నిత్య మీనన్ ఇందులో ఆటవిక తెగ కి చెందిన అమ్మాయిగా నటిస్తుందని తెలుస్తుంది .అయితే ఇందులో నిత్యామీనన్ జూనియర్ ఎన్టీఆర్ సరసన నటిస్తుందా లేదంటే మరో ప్రముఖ పాత్రలో నటిస్తున్న విషయం లో క్లారిటీ లేదు.

అయితే ఇంతకుముందు జూనియర్ ఎన్టీఆర్ నిత్యామీనన్ కలిసి జనతాగ్యారేజ్ లో నటించారు. నిత్యది ప్రముఖ పాత్ర అయితే ఎన్టీఆర్ కోసం మరో హీరోయిన్ ని వెతకాల్సి ఉంది. సుమారు 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఆ చిత్రం 2020 జూన్ లో విడుదల కాబోతుందని చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది. దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సినిమా పరిశ్రమలోని దిగ్గజ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేస్తున్నారు.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి