NewsWaves.news

సియోల్ శాంతి పుర‌స్కారం స్వీక‌రించిన ప్ర‌ధాని మోదీ

భార‌త ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ ప్రస్తుతం ద‌క్షిణ కోరియా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న విష‌యం తెలిసిందే. రెండు రోజుల ప‌ర్య‌ట‌న‌లో మోదీ ప‌లు కార్య‌క్రమాల్లో పాల్గొంటారు. ఎన్నో ఒప్పందాలు చేసుకుంటారు. ప్ర‌పంచ శాంతికోసం, అభివృద్ధి, సోద‌ర భావం పెంపొందించినందుకు గాను ఆయ‌న‌కు సియోల్ శాంతి పుర‌స్కారం ప్ర‌క‌టించింది ద‌క్షిణ కోరియా. ఈరోజు రాజ‌ధాని సియోల్‌లో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో మోడీ ఈ అవార్డును అందుకున్నారు.

ఈ అవార్డును అందుకున్న త‌ర్వాత ప్ర‌ధాని మాట్లాడుతూ….

∎ సియోల్ శాంతి పుర‌స్కారం భార‌త దేశానికి ద‌క్కిన గౌర‌వం అన్నారు
∎గ‌త ఐదేళ్ల‌లో భార‌త్ సాధించిన ప్ర‌గ‌తికి ఇది నిద‌ర్శ‌నం అన్నారు మోదీ.
∎ మ‌హాత్మాగాంధీ 150వ జ‌యంతి జ‌రుగుతున్న సంవ‌త్స‌రంలోనే ఆ పుర‌స్కారం అందుకోవ‌డం గ‌ర్వంగా ఉంద‌న్నారు.

22.02.2019


ద‌క్షిణ కోరియాలో ప్ర‌ధాని మోదీ బిజీ బిజీ



భార‌త ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ఈ రోజు ఉద‌యం సియోల్ (ద‌క్షిణ కోరియా) చేరుకున్నారు. రెండు రోజుల పాటు ఆ దేశంలో ప‌ర్య‌టించ‌నున్న ప్ర‌ధాని ద‌క్షిణ కోరియా అధ్య‌క్షుడు మూన్ జే ఇన్‌తో ద్వైపాక్షిక చ‌ర్చ‌లు జ‌ర‌ప‌నున్నారు. అనంత‌రం సియోల్ శాంతి పుర‌స్కారాన్ని స్వీక‌రించనున్నారు.

అంతర్జీయ సహకారం, ప్రపంచ అభివృద్ధి, మానవ విలువలను పెంచడంలో చేసిన కృషికి గాను మోదీని దక్షిణకొరియా ఈ పురస్కారంతో సత్కరిస్తోంది.

కీల‌కాంశాలు

  • ఇండియా-దక్షిణకొరియా బిజినెస్ సింపోజియంలో ప్రధాని ప్ర‌సంగించ‌నున్నారు.
  • ఇండియా-దక్షిణకొరియా స్టార్టప్ హబ్ ను ఆవిష్క‌రించ‌నున్నారు.
  • కింహే సిటీలో దక్షిణ కోరియా అధ్య‌క్షుడితో రేపు స‌మావేశం కానున్నారు.

Related Articles