NewsWaves.news

ప్రముఖ సినీ నటుడు రాళ్ళపల్లి మృతి…

ప్రముఖ రంగస్థల నటుడు, సినిమా నటుడు రాళ్ళపల్లి నరసింహారావు(73)అనారోగ్యంతో నేడు తుది శ్వాస విడిచారు.ఆయన తూర్పు గోదావరి జిల్లా రాచపల్లిలో అక్టోబర్ 10, 1945లో జన్మించారు.రాళ్లపల్లి చిన్నతనం నుంచే నాటక రంగంలో ఉన్నారు. ఆయన దాదాపుగా 8 వేలకు పైగా నాటకాల్లో నటించారు. అయితే ఆ నాటకాలలో ఎక్కువ శాతం ఆయనే స్వయంగా రాసి, దర్శకత్వం వహించారు. 30 సంవత్సరాల సినీ జీవితంలో రాళ్లపల్లి దాదాపు ఆరొందలకు పైగా సినిమాలలో నటించారు. ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలు పోషించిన రాళ్లపల్లి….

ఎలాంటి పాత్రనైనా సహజంగా, సునాయాసంగా చేసేవారు.1973లో ‘స్త్రీ’ అనే చిత్రంతో వెండితెరకు పరిచయమైన రాళ్లపల్లి, జాతీయస్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఎంపికైన ఊరుమ్మడి బతుకులు సినిమాతో నంది అవార్డును అందుకున్నారు.ఆ తర్వాత అనేక సినిమాలలో నటించి ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు రాళ్లపల్లి. ముఖ్యంగా ఆయన జంధ్యాల, వంశీ తీసే సినిమాలలో తప్పకుండా ఉండేవారు. రాళ్లపల్లి మృతి పట్ల అనేక మంది సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి