NewsWaves.news

ప్రపంచ అత్యుత్తమ విమానాశ్రయాల్లో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చోటు.

ప్రపంచంలోనే అత్యుత్తమ విమానాశ్రయాల జాబితాలో హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టాప్ టెన్ లో చోటు దక్కించుకుంది. 2019 సంవత్సరానికిగాను విమానాశ్రయాల ర్యాంకింగ్ లను ఎయిర్ హెల్ప్ అనే సంస్థ తాజాగా విడుదల చేసింది .

ఇందులో శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 8వ స్థానంలో నిలిచింది.మొదటి ఎయిర్ పోర్ట్ గా ఖతారు లోని హామద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత జపాన్ లోని టోక్యో అంతర్జాతీయ విమానాశ్రయం రెండో స్థానంలో ఉంది.గ్రీస్ లోని ఏథెన్స్ అంతర్జాతీయ విమానాశ్రయం మూడో స్థానం లో ఉంది. కాగా అమెరికా,ఇంగ్లాండ్ నుంచి ఏ విమానాశ్రయాలు టాప్ టెన్ లో చోటు దక్కించుకోలేకపోయాయి.

ఎయిర్ పోర్ట్ ఇన్ టైం, నిర్వహణ ఆహారం, షాపింగ్ వంటివి పరిగణలోకి తీసుకొని ఈ ర్యాంకింగ్స్ ఇచ్చింది. ప్రపంచంలోనే 10 అత్యుత్తమ విమానాశ్రయాల్లో ఇండియా నుండి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం మాత్రమే ఎంపిక అయింది.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి