NewsWaves.news

సంజౌతా ఎక్స్ ప్రెస్ ర‌ద్దు చేసిన పాక్‌

ఇండియా- పాకిస్తాన్ మ‌ధ్య యుద్ధ వాతావ‌ర‌ణం నెల‌కొన్న ప‌రిస్థితిలో పాకిస్థాన్ సంఝౌతా ఎక్స్‌ప్రెన్ ను నిలిపివేసింది. ప్ర‌స్తుతం పాక్‌లోని లాహోర్‌లో ఉన్న ఆ ట్రైన్‌ను నిలిపివేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది. ఈ రోజు ఉద‌యం ఈ ట్రైన్ లాహోర్ నుంచి ఢిల్లీకి బ‌య‌లుదేరాల్సి ఉంది. అయితే ఇప్పుడు ర‌ద్దు చేయ‌డంతో ఆ ప్ర‌యాణం ఆగిపోయింది. వారానికి రెండు సార్లు మాత్ర‌మే న‌డిచే సంఝౌతా ఎక్స్ ప్రెస్ ఢిల్లీ నుంచి అటౌరీ మ‌ధ్య‌లో న‌డుస్తోంది.

బుధ‌వారం , ఆదివారం ఢిల్లీ నుంచి స్టార్ట్ అయ్యి.. పాకిస్తాన్ చేరుతుంది. అందులో భాగంగానే బుధ‌వారం ఉద‌యం ప్రారంభం కావాల్సిన ప్ర‌యాణాన్ని నిలిపివేశారు. దీంతో లాహోర్‌లోనే ప్ర‌యాణికులు ఆగిపోయారు. 1971లో భారత్-పాకిస్తాన్ ల మధ్య జరిగిన సిమ్లా ఒప్పందం ప్రకారం సంఝౌతా ఎక్స్ ప్రెస్ నడుస్తోంది. 1976 జూలై 22 నుంచి సంఝౌతా ఎక్స్ ప్రెస్ ఇరుదేశాల మధ్య రాకపోకలు సాగిస్తోంది.

Related Articles