NewsWaves.news

ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ సరసన ఎవరు?

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ఆర్ఆర్ఆర్.రామ్ చరణ్,ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న భారి చిత్రం ఆర్ఆర్ఆర్.ఈ దేశవ్యాప్తంగా ఉన్న భారీ తారాగణం ఈ చిత్రంలో నటిస్తున్నారు.ఈ చిత్రం లో ఆలియా బట్, అజయదేవగన్ వంటి బాలీవుడ్ స్టార్లు నటిస్తున్నారు.ఇంతకుముందు నిత్య మీనన్ నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.

ఇప్పుడు క్రేజీ నటి సాయి పల్లవి నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఎన్టీఆర్‌ కోసం బ్రిటిష్‌ భామ డైసీని ఎంపిక చేసినా, ఆమె కొన్ని కారణాలతో ఆరంభంలోనే తప్పుకొంది. ప్రముఖ కథానాయిక సాయిపల్లవి కథానాయికగా ఎంపిక చేయబోతున్నారా లేక కీలక పాత్ర కోసమా అనేది తెలియాల్సి ఉంది.ఆ స్థానాన్ని భర్తీ చేయడం కోసం రాజమౌళి బృందం ఎప్పట్నుంచో కసరత్తులు చేస్తోంది.దానయ్య నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సెంథిల్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. దేశ విదేశ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి