NewsWaves.news

మావయ్య వద్దన్నాడు… సాయి ధరమ్ తేజ్

వరుస పరాజయాల తర్వాత మెగా కాంపౌండ్ నుండి వచ్చిన హీరో సాయి ధరమ్ తేజ్ చేస్తున్న చిత్రం చిత్రలహరి.ఈ సినిమా భారీ అంచనాల నడుమ ఈ నెల 12వ తేదీన విడుదల కాబోతోంది. సినిమా విడుదల నేపథ్యంలో చిత్ర యూనిట్ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి తిరుమలకు వెళ్లారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సాయి ధరమ్ తేజ్ జనసేన పార్టీకి ప్రచారం చేసే విషయం పైన వివరణ ఇచ్చారు.తాను పార్టీ తరపున ప్రచారం చేస్తానని చెప్పానని, కానీ మావయ్య పవన్ కళ్యాణ్ వద్దని చెప్పారని, మొదట సినిమాపై దృష్టి పెట్టమన్నారని వివరించాడు సాయి ధరమ్ తేజ్.అయితే నేరుగా ఎన్నికల ప్రచారంలో సాయి ధరమ్ తేజ్ పాల్గొనకపోయినప్పటికీ, సోషల్ మీడియా వేదికగా గ్లాస్ గుర్తుకే ఓటు వెయ్యమని ప్రజలను కోరాడు.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి