NewsWaves.news

చిత్ర‌ల‌హ‌రి సినిమాతో అంద‌రికి స‌మాధానం చెబుతా..

వ‌రుస ఫ్లాపులతో సాగుతున్నసాయిధ‌ర‌మ్ తేజ్‌ న‌టిస్తోన్న తాజా చిత్రం చిత్ర‌ల‌హ‌రి. ఈ మూవీని కిషోర్ తిరుమ‌ల తెర‌కెక్కిస్తున్నాడు. తేజ్ స‌ర‌స‌న కళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్‌… నివేత పేతురాజ్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ‌లో ఉన్న ఈ మూవీకి సంబంధించి ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం వెల్ల‌డించాడు సాయిధ‌ర‌మ్ తేజ్. చిత్ర‌ల‌హ‌రి మూవీ ఎమోష‌న‌ల్ ఎంట‌ర్టైన‌ర్ అని.. తండ్రి కొడుకుల మ‌ధ్య జ‌రిగే ఈ క‌థ‌కు ఈత‌రం బాగా క‌నెక్ట్ అవుతుంద‌ని తెలిపాడు. త‌న‌ను విమ‌ర్శించే వారికి ఈ సినిమాతోనే స‌మాధానం చెబుతాన‌న్నాడు. ఈమూవీ ఏప్రిల్ 12న విడుద‌ల కానుంది.

Related Articles