NewsWaves.news

రోబో పోలీస్ వ‌చ్చేసింది!

భారత్‌లో రోబో పోలీస్ అడుగు పెట్టేసింది. స్టేష‌న్‌కు వ‌చ్చే ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, కంప్లైంట్స్ తీసుకుని సంబంధిత అధికారులకు అంద‌జేయనుంది. ఈ రోబోను కేర‌ళ పోలీస్ డిపార్ట్‌మెంట్ ప్ర‌యోగాత్మ‌కంగా విధుల్లోకి తీసుకుంది. దేశంలోన తొలి హ్యూమ‌నాయిడ్ రోబోను కేర‌ళ‌ రాష్ట్ర ముఖ్య‌మంత్రి పిన‌ర‌యి విజ‌య‌న్ ఆవిష్క‌రించాడు.

ఇక‌పై ఈ రోబో హెడ్ క్వార్ట‌ర్స్ లో రెగ్యుల‌ర్‌గా డ్యూటీ చేయ‌నుంది. అక్క‌డికి వ‌చ్చే ప్ర‌జ‌ల‌ను ప‌ల‌క‌రించి వారి స‌మ‌స్య‌ను తెలుసుకొని ఉన్నతాధికారుల‌కు తెలియ‌జేయనుంది. పోలీస్ వ్య‌వ‌స్థ‌లో సాంకేతిక‌త‌ను చేర్చ‌డ‌మే త‌మ ల‌క్ష్య‌మ‌న్న డిజిపీ లోక్‌నాథ్.. ఈ రోబోకు ఎస్సై ర్యాంకు క‌ల్పించారు.

Related Articles