NewsWaves.news

నన్ను వేధిస్తున్నారు : ప్రియాంక భర్త వాద్రా

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు తనను వేదిస్తున్నారంటూ కాంగ్రెస్ కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా ఆరోపించారు. రాబర్ట్ వాద్రా కంపెనీకి చెందిన 4.62 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అధికారులు నిన్న జప్తు చేసిన నేపథ్యంలో వాద్రా ఈ వ్యాఖ్యలు చేశారు.

“నన్ను ఎప్పుడు విచారణకి పిలిచినా వెళ్లి హాజరవుతున్నాను. అన్ని విధాలుగా సహకరిస్తున్నాను. అయినప్పటికీ నా కార్యాలయాన్ని ఈడీ అధికారులు జప్తు చేశారు. నన్ను వేధింపులకు గురి చేస్తున్నారు. న్యాయం కోసం ఎదురు చూస్తాను.” అంటూ రాబర్ట్ తన ఫేస్ బుక్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. ఈడీ అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారంటూ ఆయన ధ్వజమెత్తారు.

Related Articles