NewsWaves.news

ఎన్టీఆర్ బ‌యోపిక్ తీయడం త‌ప్పే.. అని బాల‌కృష్ణ అన‌లేదు

హెడ్‌లైన్ క‌న్‌ఫ్యూజింగ్‌గా ఉందా…అయితే ఇప్పుడు క్లారిటీ వ‌చ్చేస్తుంది. ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను తెర‌కెక్కిస్తోన్న రామ్ గోపాల్ వ‌ర్మ మ‌హానాయ‌కుడు మూవీ గురించి ప‌నిగ‌ట్టుకొని విమ‌ర్శ‌లు చేస్తున్నాడ‌నే విష‌యం తెలిసిందే. అందులో భాగంగా ఈరోజు ఒక ట్వీట్ చేశాడు వ‌ర్మ‌. అందులో ఒక వీడియో ఉంది. ఈవీడియోలో బాల‌య్య బాబు ఎన్టీఆర్ గెట‌ప్‌లో నా జీవితంలో చేసిన ఒకే ఒక త‌ప్పు డైలాగ్ చెబుతాడు.

కానీ ఎవ‌రో ఈ డైలాగ్‌ను మార్చి పెట్టారు. దాని ప్ర‌కారం నా జీవితంలో నేను చేసిన ఒకే ఒక త‌ప్పు.. మ‌హానాయ‌కుడు తీయ‌డం అని బాల‌కృష్ణ (ఎన్టీఆర్‌) అంటాడు. ఆ వీడియో ఫేక్ అయినా వైర‌ల్ అవుతోంది.

Related Articles